Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుటీడీపీ బీసీలకు పుట్టినిల్లులాంటిది

టీడీపీ బీసీలకు పుట్టినిల్లులాంటిది

  • బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీనే
  • బీసీలకు జగన్ చేసిందేమీలేదు

టీడీపీ బీసీ నాయకులు
యనమల ,నులుకుర్తి , డాక్టర్ చప్పిడి , పెంకే శ్రీ నివాస్

కరప

రాజకీయ చిత్రపటంలో బీసీ వర్గాలకు టీడీపీ పుట్టినిల్లు లాంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యనమల కృష్ణుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు,కాకినాడ రూరల్ పరిశీలకులు కుడిపూడి సత్తిబాబు, రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహ కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు పేర్కొన్నారు. కరప మండలం యండమూరులో ఆ పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహ కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు పాలన వరకు బీసీ వర్గాలకు పాలనలో, పదవుల్లో సముచిత గౌరవం ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందని చెప్పారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు రాజకీయ అధికారానికి దూరంగా ఉండేవారన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కాదని, సమాజానికి బ్యాక్‌ బోన క్లాసెస్‌ అని నినదించిన స్వర్గీయ ఎన్టీఆర్‌ అందుకు అనుగుణంగా రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించిన చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి అనేక మంది బీసీలను తిరుగులేని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దారన్నారు. అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశారన్నారు. జగన్మోహనరెడ్డి పాలనలో రాష్ట్రంలోని బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారన్నారు. కార్పొరేషన్లు ఫుల్‌, నిధులు నిల్‌ కావడంతో గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో బీసీలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తేవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో పెత్తందారీ మనస్తత్వం కలిగిన వైసీపీని ఓడించి సామాజిక న్యాయం పాటించే టీడీపీని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ మాట్లాడుతూ జగన్ పాలనలో బీసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్న టీడీపీ, జనసేనలను గెలిపించాలని కోరారు. తర్వాత టీడీపీ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి ఏసుదాసు, కటకంశెట్టి ప్రభాకర్ (బాబి), మట్టా ప్రకాష్ గౌడ్, జనసేన నాయకులు బండారు మురళీ, కర్రెడ్ల గోవింద్ తదితరులు ప్రసంగిస్తూ రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్క కార్పొరేషనకైనా రూపాయి నిధులు విడుదల చేశారా అని అన్నారు. బీసీలంటే బ్యాక్‌బోన అంటూ నినాదాలు ఇవ్వడం కాదని, బీసీల అభ్యున్నతికి ఏమి చేశావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల సిద్ధం.. సిద్ధం అంటున్నారే.. దేనికి సిద్ధమని నిలదీశారు. మహిళలు తాళిబొట్లు తెంచడానికి, రైతుల ఊసురు తీయడానికా, పేదల పొట్ట కొట్టడానికా.. దేనికి సిద్ధమని దుయ్యబట్టారు. టీడీపీ పాలనలో బీసీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఇందుకు రూ.కోట్లు నిధులు వెచ్చించారని గుర్తు చేశారు. టీడీపీతోనే బీసీలకు గౌరవం లభించిందని పేర్కొన్నారు. తొలుత వారు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ నులుకుర్తి వీరన్న, మాజీ ఎంపీటీసీ పలివెల జానకీరామయ్య, కరప మండల టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్న, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటికాయలు వీరబాబు టీడీపీ నాయకులు సర్వశుద్ది ఏడుకొండలు, కాకరపల్లి చలపతిరావు, కొండా వినాయక్, ఎజ్జల బాబ్జి, బొంతు నాగేశ్వరరావు, ములసా బాబురావు, తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article