Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం వివరాలు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం వివరాలు

• అధికారం అడ్డపెట్టుకుని పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర
• కీలక పాత్రదారిగా పెద్దసారు (సీఎస్)
• దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూములను సీఎస్, ఆయ కుమారుడు, ఆయన బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తియాదవ్ ఆరోపణ
• ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా మూర్తియాదవ్ కు బెదిరింపులు
• పెద్ద సారు అల్లుడే మాఫియా అంతా తిప్పుతున్నాడని వార్తలు వస్తుంటే ఎందుకు స్పందించరు?
• ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు.. ? విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఇతను మీకు ఎలా తెలుసు? తెలిస్తే ఎలా తెలుసో చెప్పండి
• తెలుస్తే ఎవరు పరిచయం చేశారు. పెద్దసారేనా? పేదల భూములను కొట్టేయడానికి పంపారా?
• సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే మూర్తి యాదవ్ ప్రాణానికి హాణీ ఉంది
• ఎన్నికల కౌంటింట్ సక్రమంగా జరిగే అవకాశం లేదు
• సీఎస్ పదవి నుండి వెంటనే జవహర్ రెడ్డిని ఎలక్షన్ కమిషన్ తప్పించాలి
• భూ దందాలో ఆరోపణలు వస్తున్న సీఎస్ పై విచారణకు వెంటనే గవర్నర్ ఆదేశించాలి

దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే పేదల భూములను పెద్ద సారుగా చెప్పబడుతున్న సీఎస్ ఆయన కుమారుడు, వారి బినామీలు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని… దాన్ని ప్రశ్నించిన జనసేన నేత మూర్తియాదవ్ ను బెధిరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. భూ దందా ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి సీఎస్ గా కొనసాగితే 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదని.. భూ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ పై రాష్ట్ర గవర్నర్ వెంటనే విచారణకు ఆదేశించాలని. ఎలక్షన్ కమిషన్ సీఎస్ పదవినుండి జవహర్ రెడ్డిని తప్పించాలని.. భూ దందాపై వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విశాఖలో భూ దందాపై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం… త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు?

ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు.. ? విశాఖ కలెక్టర్ మల్లికార్జున, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిలకు ఇతను ఎలా తెలుసు? తెలిస్తే ఎలా తెలుసో చెప్పాలి. తెలిస్తే ఎవరు పరిచయం చేశారు? పెద్దసారేనా, వారి తనయుడా? పేదల భూములను కొట్టేయడానికి పంపారా? పేదల భూములను అప్పనంగా అతి తక్కువ ధరకే ఎలా కొట్టేశారు… అక్రమంగా పేదలను భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? కార్తిక అప్పల పైడమ్మ భూమిని తక్కువ ధరకు కొట్టేసి రిజిస్ట్రేషన్ చేయించకున్న తీరే వీరి భూ దందాకు ఉదాహరణ.

సీఎస్ పై గవర్నర్ విచారణకు ఆదేశించాలి

అధికారులపై ఆరోపణలు వస్తే పాలన యంత్రాంగం, ఏసీబీ ఊరుకుంటుందా? వెంటనే ఎంక్వైరీ వేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోమని చెబుతారు. ఇప్పుడు చేతులు అన్ని సీఎస్ వైపు చూపిస్తున్నాయి. వెంటనే గవర్నర్ సీఎస్ పై విచారణకు ఆదేశించాలి.. సీఎస్ పదవినుండి జవహర్ రెడ్డి పక్కనపెట్టాలి. భూ దందాపై ఏసీబీ చీఫ్ వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలి. ఏసీబీలో నిజాయతీగలిగిన అధికారికి ఆ కేసును అప్పగించాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ అధికారంలో ఉంటే ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదు. కౌంటింగ్ సంబంధించిన ఏ ఒక్క ప్రకటన సీఎస్ చేయడానికి వీలు లేకుండా చూడాలి. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని సీఎస్ ను పదవి నుండి తొలగించాలి. ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడాలి.

విశాఖ భూ దందాపై సీబీఐ తో విచారణ చేపట్టాలి

B పట్టాలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీల భూముల దగ్గరకు వెళ్లి సీఎస్ చూసి వస్తారు. తరువాత త్రిలోక్ ముఠా గద్దలాగా అక్కడ వాలి పేదలను భ్రమ పెట్టి భూములను కొట్టేస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కోరాల్సిన అధికారి ఇలా చేయం కరెక్టేనా? త్రిలోక్ ముఠా కంచే వేయడానికి వెళితే రైతులు తిరగబడ్డారు. సీఎస్ ను కూడా బూతులు తిట్టారని వార్తలు వస్తే ఎందుకు స్పందించడంలేదు. తప్పు చేయకుంటే దానికి నాకు సంబంధంలేదని ఎందుకు ఖండించడంలేదు? సీఎస్ పేరు చెప్పి ముఠా పేట్రేగి పోతున్నారని వార్తలు వస్తుంటే జవహర్ రెడ్డి ఎందుకు నోరు మెదపరు? ఈ భూ దందాపై గవర్నర్ పూర్తి విచారణకు ఆదేశించాలి. సీబీఐ తో గాని, హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో గాని విచారణ చేపట్టి భూ దందాలో ఉన్న కుట్రదారులందరిని బయట పెట్టి కటకటాల్లోకి నెట్టాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article