టి.నరసాపురం.
టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన టి నరసాపురం హైవే పై మంగళవారం జరిగింది .వివరాలు ఇలా ఉన్నాయి . నూతనంగా నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పై మట్టిని తరలిస్తున్న టిప్పర్ పొలంలోకి కూలిపని నిమిత్తం వెళుతున్న ప్రసన్నగంటి మరియన్న ను డి కొనడంతో మరియన్న అక్కడికక్కడే మృతిచెందాడు .మృతుని భార్య బుజ్జి ,కుమారుడు మంగరాజు మృతదేహం వద్ద తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తరలించడానికి వీలులేదని కొంతసేపు ధర్నా నిర్వహించారు .అనంతరం పోలవరం నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ లంకా జయబాబు ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో రహదారినిపై బైఠాయించి బాధిత కుటుంభానికి న్యాయం జరిగేవరకు ధర్నాను విరమించేదిలేదని ,అవసరమయితే జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు .సంఘటనా స్థలాన్ని జీలుగుమిల్లి సి ఐ క్రాంతికుమార్ సందర్శించి టిప్పర్ ను.డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు .

