వేంపల్లె
స్థానిక క్రిస్టియన్ కాలనీకి చెందిన టిడిపి అభిమాని బండి రవికుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించినట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ రామమునిరెడ్టి అన్నారు. శనివారం టిడిపి నేతలతో కలిసి మృతి చెందిన బండి రవి సతీమణి సునీతకు రూ.లక్ష నగదును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రామమునిరెడ్టి మాట్లాడుతూ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో నివాసం ఉంటున్న బండి రవికుమార్ ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తుండేవాడని, ఆర్థిక సమస్యల కారణంగా మృతి చెందారని.. టిడిపి ఇంఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించిన సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారన్నారు. మృతునికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారని, చలించిన ఇంఛార్జి బిటెక్ రవి పిల్లల పేరు మీద రూ. లక్ష ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలని సూచించినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని తన చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మహమ్మద్ షబ్బీర్, ఎన్ఎస్ దర్బార్, ఎస్పిజయచంద్రారెడ్డి, తెలంగాణవలి, వీరభద్ర, ఈశ్వరయ్య, మహమ్మద్, నాగభూషణం, వేమాకుమార్, రెడ్డికిషోర్, నాగసుబ్బయ్య, మడకశ్రీను, డక్కారమేష్, జబివుల్లా, షరీఫ్, పిపి చెండ్రాయుడు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.