జగ్గంపేట నియోజకవర్గంలో దళిత నాయకుల దళిత గళం ప్రచార కార్యక్రమం ప్రారంభం
ప్రత్యేక వాహనంలో బయలుదేరి దళిత వాడలలో జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేయనున్న దళిత నేతలు
జగ్గంపేట :స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రత్యేక వాహనంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ దళిత నేతలు ప్రత్యేక వాహనంలో బయలుదేరి గ్రామాల్లో ఉన్న దళితవాడలో జ్యోతుల నెహ్రూ ని గెలిపించమని కోరుతూ దళిత గళం పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ వాహనానికి జ్యోతుల నెహ్రూ జండా ఊపి ప్రారంభించారు. అనంతరం దళిత నేతల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ పథకాలు దళితులకు చేసిన ద్రోహాలు ప్రజలకు వివరించి రేపు రాబోయే ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూని గెలిపించండి దళితుల బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలబడని కోరుతూ దళిత వాడల్లో ప్రచారం నిర్వహిస్తున్నామని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారని ఎస్సీ ఎస్టీలకు లోన్లు పూర్తిగా రద్దు చేశారని అంబేద్కర్ విదేశీవిద్య విధానం రద్దు చేశారని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో స్టేషన్ బెల్ పొంది సులువుగా తప్పించుకుంటున్నారని ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేసిన ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దళితులందరూ ఏకమై గద్దిదించాలని దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, వీటన్నిటిపై దళితుల్లో చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో ఈ యొక్క దళిత గళం కార్యక్రమం ప్రారంభించామని మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గెలుపుకు మేమందరం సైనికుల పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని దళిత నేతలు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
