Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుజె కొత్తూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 25 కుటుంబాల తెలుగుదేశం పార్టీలో చేరిక

జె కొత్తూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 25 కుటుంబాల తెలుగుదేశం పార్టీలో చేరిక

జగ్గంపేట

జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్తిరెడ్డి శ్రీను, అడపా పల్లంరాజు, దెయ్యాల శ్రీను, తుట్ట రవణ, తుట్టా సత్తియ్య, దెయ్యాల సూరిబాబు, వడ్డాది గోపి, ప్రగడ సతీష్, దువాపు శ్రీను, మాయలేటి శ్రీను, దెయ్యాల దుర్గ, కోరుకొండ త్రిమూర్తులు తదితర 25 కుటుంబాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జనసేన పార్టీ నాయకులు నకి రెడ్డి రాంబాబు, నకిరెడ్డి వెంకన్న, అడబాల నాగు, నకిరెడ్డి పండు, సిరిమల రాంబాబు తదితరులు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం కృషి చేస్తామని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడని అన్నారు. సిద్ధం అని గొప్పగా చెప్పుకుంటున్న నువ్వు దేనికి సిద్ధమని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో నాలుగు అంశాలతో నేను గెలిచిన తర్వాత విద్యా, వైద్యం, ఉద్యోగ కల్పన, సాగునీరు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, చల్లా రామ్మూర్తి, చింతల తాతబ్బాయి, దంట పెద్దకాపు, పైడిపాల సూరిబాబు, సుంక విల్లి రాజు, దాపర్ర్తి సీతారామయ్య, అడపా మైనర్, నకిరెడ్డి సూర్యవతి, తిప్పన సత్యవతి, వెలిశెట్టి శ్రీను, పాట్రు కృష్ణ, సర్వసిద్ధి లక్ష్మణరావు, కమ్మి ల వెంకటేశ్వరరావు, ఉప్పలపాటి బుల్లెబ్బులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article