Friday, May 9, 2025

Creating liberating content

తాజా వార్తలుజిల్లాలో ముమ్మ‌రంగా విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర‌

జిల్లాలో ముమ్మ‌రంగా విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర‌

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రారంభ‌మైన విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌కు విశేష ఆధ‌ర‌ణ ల‌భిస్తోంది. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చి వారిని ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.జిల్లాలోని పాడేరు, అర‌కు, రంప‌చోడ‌వ‌రం మండ‌లాల్లో ముమ్మ‌రంగా వివిధ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి అధికారులు ప‌లు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.
పాడేరు మండ‌లంలో నోడ‌ల్ అధికారి, ఎంపిడిఒ కె సాయి న‌వీన్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విస్తృతంగా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇంద్ర‌ప‌ల్లె, బొడిమేల‌లో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర క్రింద ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆరోగ్య శాఖ‌కు చెందిన ప్ర‌తినిధులు స్థానికుల‌కు వివిధ వ్యాదుల‌మీద అవ‌గాహ‌న క‌ల్పించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జ‌మాల్ పాషా ముఖ్యఅతిధిగా పాల్గొని వివిధ వ్యాధుల‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్త‌త చేశారు. వైద్యారోగ్య శాఖ చెప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను వివిరించారు. ఈ సందర్భంగా స్థానిక ఆశా వ‌ర్క‌ర్లు, ఆరోగ్య‌శాఖ సిబ్బంది అవ‌గాహాన ర్యాలీ నిర్వ‌హించారు. అలాగే మొలిక‌ల్లు గ్రామంలో రైతుల‌కు డ్రోన్ వినియోగంపై అవ‌గాహ‌న క‌ల్పించి, వాటి వినియోగంతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిటిసిఓ డాక్ట‌ర్ టి.విశ్వేశ్వ‌ర‌రావు, ఎస్ ఒ డాక్ట‌ర్ కైలాస్ , కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ అనీల్ పాల్గోన్నారు.
అర‌కువేలీ మండ‌లంలో నోడ‌ల్ అధికారి, ఎంపిడిఒ సిహెచ్ వేంక‌టేశ్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర నేప‌ధ్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. మండ‌లంలో కొత్త‌బ‌ల్లుగూడ‌లో స‌చివాలయం సిబ్బంది, గ్రామ పంచాయ‌తి సిబ్బంది , స్థానిక పాఠ‌శాల విద్యార్థులు, సిబ్బంది ప్ర‌ త్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ప‌లు గ్రామాల్లో డ్రోన్ ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్ కె.రాధిక‌, పిహెచ్ సి వైద్యాధికారి కిర‌ణ్మ‌ని, ఎపిఎం అప్ప‌య‌మ్మ‌, పంచాయ‌తి సెక్ర‌ట‌రీ బి.విజ‌య‌కుమార్‌, స‌చివాల‌యం సిబ్బంది, గ్రామ‌స్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

రంప‌చోడ‌వ‌రం మండ‌లంలో నోడ‌ల్ అధికారి, ఎంపిడిఒ బి హ‌రికృష్ణ ఆధ్వ‌ర్యంలో విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర‌లో భాగంగా వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. జ‌ర‌గాం ప‌ల్లె,ఫోక్సు పేట, బీరంప‌ల్లి, వూట్ల గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య విష‌యాల‌పై, రైతుల‌కు డ్రోన్ ద్వారా వ్య‌వ‌సాయ విధానాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ ల‌బ్దిదారుల‌కు గుర్తింపు కార్డులు పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిడిఒ బి హ‌రికృష్ణ‌, ఈవో పిఆర్ డి జాన్ మిల్ట‌న్‌, ఐటిడిఎ పిఐఓ డాక్ట‌ర్ మ‌ధ‌న్‌, కెవికె పైంటిస్టు డాక్ట‌ర్ ల‌లిత‌, వైద్యాధికారులు డాక్ట‌ర్ క‌విన్‌, సుజాతా, నాబార్డు ఎడిఎం నాయుడు, గ్రామ స‌ర్పంచులు, స‌చివాల‌య‌, వైద్యారోగ్య‌శాఖ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article