Friday, November 14, 2025

Creating liberating content

తాజా వార్తలుజిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం

జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం


👉🏽జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు
👉🏽వందరోజుల కార్యాచరరణ ప్రణాళిక తో గంజాయి కట్టడికి శ్రీకారం
👉🏽 ప్రజలు పోలీసు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలి

జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్

కడప సిటీ : జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియో గం, అక్రమ రవాణా, విక్రయాల పై కొరడా ఝుళిపించేందుకు వ వందరోజుల కార్యాచరణ ప్రణా ళికతో పోలీస్ శాఖ చర్యలు చే పట్టినట్లు ఆయనతెలిపారు.
ఈ ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగాప్రత్యేక పోలీస్ బృం దాలతో నిఘా ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవారిని, మళ్ళీ నేరాలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించటం జరు గుతుంది అన్నారు. పదే పదే గ
Oజాయి నేరాలకు పాల్పడే వా రిపై హిస్టరీ షీట్లు తెరవడంతో పాటు పి.డి యాక్ట్ ప్రయోగించ చడం జరుగుతుందని ఎస్.పి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్
పోస్టులు ఏర్పాటు చేసి వాహ నాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగావిస్తృతంగానాకాబందీ నిర్వహించి అనుమానితుల ఇ ళ్లలోతనిఖీలునిర్వహించడం జరుగుతుందన్నారు.గంజాయి,
ఇతర మాదక ద్రవ్యాల ద్వారా కలిగే అనర్ధాలపై కళాశాలలు, విద్యాసంస్థల్లో అవగాహనా స దస్సులు నిర్వహించడం జరు గుతుందన్నారు.ప్రజలుగంజాయికి సంబంధించిన సమాచా రాన్ని 14500 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్.పి సూచించారు. సమాచా రమిచ్చిన వారి వివరాలు గో ప్యముగా ఉంచబడుతుందని ఆయన తెలిపారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు తమ వం తు సామాజిక బాధ్యతగా పోలీ స్ శాఖకు సహకరించాలని కో రారు. గంజాయి సేవించే వ్యస నానికి బానిసగా మారిన వారి సమాచారమిస్తే వారిని రిమ్స్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల లోని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించి తిరిగి వారిని సమాజంలో సాధ రణ వ్యక్తుల్లా మార్చేందుకు పో లీస్ శాఖ చర్యలు చేపట్టిందని ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ. పి.
ఎస్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article