చింతూరు :మండలంలోని చట్టి గ్రామంలోగల గొల్లగుంపులో జామాల్ ఖాన్ స్వచ్ఛంద సంస్ధ (జె.కె.సి.టి) సహాకారంతో చేతి పంపు ఏర్పాటుకు ఆదివారం రిగ్గు వేశారు. సంస్ధ డైరెక్టర్, ప్రముఖ ఆఫ్రీన్ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు డాక్టర్ జామాల్ ఖాన్, స్దానిక పెద్దలు టెంకాయ కొట్టి రిగ్గు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జామాల్ ఖాన్ మాట్లాడారు. గొల్లగుంపు గ్రామ ప్రజలు గుంపులో తాగునీటి సమస్య ఉందని, చేతిపంపు ఏర్పాటుచేసి తాగునీటి సమస్య తీర్చాలని తమను కొరారన్నారు. వారి కోరిక మేరకు గ్రామంలో చేతి పంపు ఏర్పాటు చేపించటం జరుగుతుందన్నారు. రిగ్గు పూర్తి అయిన వెంటనే బోరు బిగించి, గ్రామస్తుల దాహార్తి తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, మాజీ అధ్యక్షులు రామారావు చౌదరి, టిడిపి మండల ప్రధాన కార్యాదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, నాయకులు సున్నం సుమన్, ముత్తయ్య, ఎండి ఆసిఫ్, నరసింహారావు చౌదరి గ్రామ పెద్దలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.