ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి.
కలసపాడు
ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ, అనిల్ గారిపై వైసీపీ గుండాల దాడినీ ఖండిస్తూ పోరుమామిళ్ల మండలంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరపోగు రవి మాట్లాడుతూ! రాప్తాడు సిద్ధం సభలో వైసిపి గుండాలు దాడి చేసిన పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దేశాన్ని మోస్తున్న నాలుగవ పిల్లర్ మీడియా అని, అటువంటి మీడియా యొక్క పాత్రికేయులపై అమానవీయంగా దాడి చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి కారణమని అన్నారు. ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిపిన దాడిని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుని మీద దాడి జరిగిన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం, వైసిపి అధికార నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. సోషల్ మీడియాలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారి మీద దాడి చేస్తున్న విజువల్స్ ప్రచారంలో ఉన్నాయని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే దాడి చేసిన గుండాలను గుర్తు పడుతున్నారని పోలీసు వ్యవస్థ గుర్తుపట్టకపోవడం హాస్యాస్పదమని అన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం కనీసం స్పందించకపోవడం వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుందని అన్నారు. పాత్రికేయుల మీద దాడి చేయడం ప్రజాస్వామ్యం పై దాడి చేయడమని ఈ దాడిని వైసిపి పార్టీ నైతిక బాధ్యత వహించాలని అలాగే నిన్నటి రోజున కర్నూలు జిల్లాలోని కూడా ఈనాడు జర్నలిస్టు కూడా దాడి చేయడం జరిగింది, ఇలాంటి గుండా వ్యక్తులపై తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగానికి డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ప్రేమ్, చారి, నాగేంద్ర, భాష, అజయ్ తదితరులు పాల్గొన్నారు.