గాజువాక:వైసిపి నాయకుల పరిచయ సభలో మంత్రి అమర్నాథ్ వెల్లడి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 74 వ వార్డు ఇన్చార్జి, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్చార్జ్ అయిన తిప్పల వంశి రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమం ఆదివారం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కాకూడదని కుట్ర పన్నుతున్నారని, పేదలు మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ది అంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే నాగిరెడ్డి అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగించారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోందని, ఈ విషయంలో ఇప్పటికీ ఎప్పటికీ తమ పార్టీ విధానం మారదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ విక్రయించేందుకు సిద్ధపడ్డ బిజెపితో తెలుగుదేశం జనసేన పార్టీలు చేతులు కలిపాయని. వారికి ఈ ఎన్నికల్లో ఓటేస్తే ప్లాంటును ప్రైవేటీకరించడానికి అనుమతి అవుతుందని అమర్నాథ్ అన్నారు. 1989లో తన తండ్రి గురునాథరావును ఈ నియోజకవర్గం నుంచి గెలిపించడంలో తిప్పల నాగిరెడ్డి కీలక పాత్ర పోషించారని, అదేవిధంగా ఇప్పుడు తిప్పల నాగిరెడ్డి గురుమూర్తి రెడ్డి వంశీ రెడ్డి దేవన్ రెడ్డి నాకు అండగా నిలబడి విజయం చేకూరుస్తారని నమ్మకం తనకు ఉందని అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ విజయం కావాలని ఆయన చెప్పారు. వచ్చే 40 రోజులు కష్టపడితే ఐదేళ్లపాటు వైసీపీ అధికారంలోకి ఉంటుందని, ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ల పాటు ఆయన అదే పదవిలో ఉంటారని అమర్నాథ్ అన్నారు.
తిప్పల వంశి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలును ప్రజలకు వివరించాలని కార్యకర్తలను, నాయకులను కోరారు. ఈ ఎన్నికల్లో అమర్నాథ్ విజయం కోసం మనమంతా కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి నిజం చేశారని చెప్పారు. నమ్మించి మోసం చేసిన మనస్తత్వం కలిగిన చంద్రబాబును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జీలకర్ర నాగేంద్ర,కొసిరెడ్డి గణేష్,భూలోక ,చిన్న రెడ్డి,రెడ్డి గొరుసు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


