రాబోవు రోజులు మళ్లీ మనవే
మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకా లు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని రాబోయే రోజులు మళ్లీ మనవే అని మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, అన్నారు. శుక్రవారం
పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని జయమ్మ కాలనీ వాసవి కాలనీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మునిసిపల్ ఇంచార్జి వై యస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హాఫిజ్,మునిసిపల్ కమిషనర్ రమణా రెడ్డి, జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి రెండవ వార్డ్ కౌన్సిలర్ గంగా లక్ష్మి, లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు.కులం చూడం, పార్టీ చూడం, మతం చూడమని ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు . రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటే ప్రభుత్వ పథకాలు అన్ని అందుతాయి అన్నారు. 175 కు 175 స్థానాలు గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాష్ట్ర ప్రజలు జగన్ వైపే చూస్తున్నారన్నారు. అంతకుముందుగా వాసవి కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిన్నపిల్లల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిత్రపటాల కు పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్ర మంలో కౌన్సిలర్ కోడి రమణ, పద్మనాభ రెడ్డి, వీరారెడ్డి,రాజేష్ నాయుడు,సిద్దయ్య, కో ఆప్షన్ నెంబర్ దాసరి చంద్రమౌళి, డేనియల్ బాబు, నగిరి గుట్ట నాగరాజు,శ్రీరాములు, ఈశ్వరయ్య ,గంగిరెడ్డి, సుంకుర రవి కాలనీ రవి,సచివాలయం సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.