Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుజగన్ ఒక అవినీతి స్టార్

జగన్ ఒక అవినీతి స్టార్

విజయనగరం:
నారా లోకేశ్ విజయనగరంలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసం గిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. “జగన్ ఒక అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనుక కుట్ర ఉం టుంది. ఇళ్ల స్థలాల్లో శంకుస్థాపనల పేరిట రూ.2 వేల కోట్లు కొట్టేశాడు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్న హామీ ఏమైంది?” అని నిలదీశారు. ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, చంద్రబాబు నిప్పులా బతికిన వ్యక్తి అని లోకేశ్ స్పష్టం చేశారు.

చంద్రబాబును చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయని వివరించారు. జగన్ ను చూస్తే బూమ్ బూమ్ బ్రాండ్లు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు.జగన్ ఒక ప్యాలెస్ పిల్లి అని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో ఎన్నో జే టర్న్ లు తీసుకున్నారని విమర్శించారు. నాడు చంద్రబాబు పిలుపుతో అమరావతి రైతులు రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చారని, కానీ మూడు రాజధానులు అంటూ అమరావతి రైతులను జగన్ ఇబ్బందిపెట్టాడని అన్నారు.
ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని అంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానని జగన్ మోసం చేశాడని, యువతకు దొరక్కుండా పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని, తాము అధికారంలోకి వస్తే ఏటా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article