కదిరి :రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారని పట్టణంలోని 31 వ వార్డు కౌన్సిలర్ ఎస్కే వలి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ మద్దతుగా ఆయన వార్డులో పట్టణ కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు వాలంటీర్ల సేవలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థపై బీసీకి ఫిర్యాదు చేసి రేపు అవతాతలకు ఇవ్వవలసిన పింఛన్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా చేయాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ఓడించి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, షాను, నౌషద్, బండారు మురళి, ఓం ప్రకాష్, మోపురి రాంప్రసాద్, బొగ్గుల రవి, కుటాగుల సలీం, పూలమండి రవి, కుంట్లపల్లి లక్ష్మీనారాయణ, వైయస్సార్ శీనా, వైయస్సార్ సిద్ధప్ప, నాగార్జున, ఇబ్రహీం, ఈశ్వర్ రెడ్డి, మహబూబ్ బేగ్, కుటాకుల గంగాధర్, రమణ నాయక్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

