వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్రఅధ్యక్షుడు పానుగంటి చైతన్య
హిందూపురం టౌన్
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందరికీ విద్య అందని విద్యగా మారిందని, ప్రస్తుత వైకాపా పాలనలో విద్యావ్యవస్థ గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తోందని వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. పలు పథకాలతో ఉత్తమమైన ఉన్నత విద్యను ఉచితంగా అందుకునే అవకాశం దక్కిందన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం ఆధ్వర్యంలో గురువారం హిందూపురంలో జగనన్న కాలేజ్ కెప్టెన్స్ పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం పలు కళాశాలలకు చెందిన విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న కాలేజ్ కెప్టెన్స్ విద్యార్ధులతో మమేకమై జగనన్న హయాంలో జరిగిన మేలుపై వారిలో అవగాహన పెంచారు. జగనన్న హయాంలో మారిన విద్యా రంగం స్థితిగతులను సమగ్రంగా వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జరిగిన విద్యారంగం నాడు-నేడు కార్యక్రమాన్ని విద్యార్ధులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం చైతన్య మాట్లాడుతూ, ,సరికొత్త ఆలోచనలు, సవ్యమైన ఆశయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో విద్యాభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకారాదనే సమోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు నాడు-నేడు వంటి కార్యక్రమాల ద్వారా అందరికీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్ర విద్యార్ధిలోకం యావత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తమ సొంత మేనమామలా భావిస్తున్నట్లు పానుగంటి చైతన్య వెల్లడించారు. ఇది సహించలేక దుష్టశక్తులన్నీ కట్టగట్టుకుని వచ్చి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇటు విద్యార్థులు కానీ… అటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ… చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మరింత చిత్తుగా ఓడించేందుకు అప్పుడే సమాయత్తం అయ్యారని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ దీపిక, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బోయ శాంతమ్మ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవ,జాయింట్ సెక్రటరీ అమర్‌నాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు కదిరేష్, ఎస్‌డిజిఎస్ కళాశాల కార్యదర్శి బైసాని రాంప్రసాద్, జిల్లా నేతలు రామకృష్ణారెడ్డి, నవీన్, మణి, రాజు, గురుబాషా, సకీబ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.