టిడిపి అభ్యర్థి రోషన్
కామవరపుకోట :జగన్ పాలన పోవాలి తెలుగుదేశం పాలన రావాలి అంటూ టిడిపి పార్టీలో పలువురు హాజరయ్యారు అని చింతలపూడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ చెప్పారు.
జంగారెడ్డిగూడెం గంగా భవాని ఫంక్షన్ హాల్ లో వైసిపి నాయకులు టీడిపి లోకి 8 మంది,అదేవిధంగా గా జనసేన పార్టీలోకి 14 మంది సొంగ రోషన్ ఆధ్వర్యంలో జాయిన్ అయినట్లు ఆయన చెప్పారు.
వీరికి టిడిపి,బిజెపి, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ పార్టీ కండువాలు వేసి వారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ మాట్లాడుతూ పార్టీని నమ్మి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఆయన తెలిపారు .క్రమశిక్షణతో కూడిన పార్టీ టిడిపి, జనసేన అని ప్రజలతో ఉండి పని చేస్తున్న పార్టీలివే అని, వైసిపి పార్టీ వచ్చాక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆయన దుయ్యబట్టారు.
అదేవిధంగా బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రాకేష్,టౌన్ టీడిపి ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్ర శేషు, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, బీసీ నాయకులు చిట్టి బోయిన రామలింగేశ్వర రావు, స్థానిక అభిమానులు తదితరులు పాల్గొన్నారు.