Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుచిన్న శేష వాహనంపై వెంకటేశ్వరుడు

చిన్న శేష వాహనంపై వెంకటేశ్వరుడు

పులివెందుల టౌన్
శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టణంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదరాజస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ఉంచి బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామ స్మరణతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని హంస వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article