Sunday, May 18, 2025

Creating liberating content

టాప్ న్యూస్చింతలపూడిగడ్డా… రేషన్ అడ్డా…

చింతలపూడిగడ్డా… రేషన్ అడ్డా…

  • చెలరేగి పోతున్న సిండికేటుగాళ్ళు
  • లింగపాలెం మండలంలో జోరుగా పీడీఎస్‌ బియ్యం దందా
  • పట్టించుకోని సివిల్ రెవెన్యూ అధికారులు
  • చేతులెత్తేసిన ధర్మాజీగూడెం పోలీస్ యంత్రాంగం
  • సంబరాల ఇంటికే సమస్యలు పెట్టిన సిండికేట్ గాళ్ళు.
    *ఆ ముగ్గురు ఒక్కటయ్యారు..
  • అన్నమో రామచంద్రయ్య అని పేదలు అల మటిస్తుంటే..
  • దయలేకపోయే దత్తు కు…
  • అందరూ కలిసి అంబరానికి పంపారు రాంబాబును..
  • ధనాధన్ తంబీ దోపిడీకి అడ్డే లేకపోయే…
  • చింతలపూడి నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతున్న దందా…
  • లబ్ధిదా రుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు..
  • ఆ మూడుగురు సిండికేటు గాళ్లుగా ఏర్పడి…
  • ఎక్కువ ధరకు విక్రయిస్తుంటే…
  • ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ పట్టుబడుతున్నా…
    *నిద్రాణం లో నిఘా వ్యవస్థ లుంటుంటే .
    *మాకెందుకులేనని మౌనంగా విజిలెన్స్ ఉంటుంటే…
    *మా సంచులు నిండాయని సీవిల్ సప్లై అధికారులు స్పందించ కుండా ఉంటుంటే…
    *చోద్యం చూస్తూ చలించని స్థితికి చట్టాలు చేరుకుంటుంటే..
    *ఇదేనా చివరికి మిగిలేదని పేదవాడు చింతిస్తుంటే…
  • ఇక చిన్నబోదా ఈ చీకటి లోకం
    (రామమోహన్ రెడ్డి)

“ఈ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నర జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం! అనేది ఏ సందర్భంలో శ్రీ శ్రీ గారు అన్నారో చెప్పగలరా?”అంటే ఆ సందర్బం లేదని చెప్పడానికి అనువైన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రజాస్వామ్య పాలనలో… ఒకనాడు పరాయి వాడు దోచుకుని తిని బానిస బ్రతుకులు చేస్తే నేడు పరాయి వాడి బదులు మనవారే దోచుకుని దాచుకుని తినడానికి అడ్డాడరులు ఎన్ని ఉన్నాయో అన్నిటిని వెతికి మరి చూసుకుంటున్నాడు.అయినా అప్పుడు ఇప్పుడు సగటు పేదవాడు బానిసలుగా లాగే బ్రతుకు బ్రతకడం తప్పడం లేదు.ప్రజాస్వామ్యం, ప్రజలపాలన అని పేరుకే చెప్పుకోవడానికే తప్ప పేద ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లో ఏ ప్రభుత్వం కూడా పెద్దగా ఆలోచన చేయదన్నది అక్షర సత్యం గా నిలుస్తుంది.పెరిగిన స్వార్థం కుటిల బుద్ది అక్రమ సంపాదన కోసం అర్రులు చాచుతున్న వారు అడ్డగోలు వ్యవహారం కి ఏ మాత్రం దడవ కుండా ఉన్నారు.ఒక మనిషి ప్రజాసేవ కోసం పోటీ చేసి ఓటమి చెందిన తరువాత పేదల బియ్యం రవాణా సిండికేట్ లో దూరి ఆ సమస్యల్లో చిక్కుకుని పొరుగు రాష్ట్రంలో ని పోలీసుల చేతిలో పరువు పోగొట్టుకుని తన ఇంటి,ఒంటిలో ఉన్న సంబరాన్ని చూడలేక ఆవేదనతో అలసి పోయి ఆ రాష్ట్రంలో జరిగిన అతి దారుణ సంఘటన ను జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెతో దిగులు చెంది డివికెక్కాడు. ఈ దిక్కుమాలిన వ్యవహారం లోకి దింపిన రామచంద్రుడు, కాస్తంత దయలేని దత్తు,ఎదయున దనాధన్ చేస్తా అన్న తంబీ ల తల తిక్క పనుల్లో భాగమై తానే చితికి చేరిపోయాడు.ఇప్పుడు ఆ సంబరాలు కరువయ్యాయని ఆ కుటుంబం అల్లాడి పోతుంటే హాయిగా పేదల బియ్యాన్ని ప్రక్కదారి పట్టుస్తూ పబ్బం గడుపుకుంటుంటే ఈ ప్రబుత్వం వారిని ఏమి పీక లేక పోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో లింగపాలెం మండలం అడ్డాగా చేసుకుని అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిలువ చేస్తూ ఆపై వాటిని చాట్రాయి మీదగా విస్సన్నపేట తరలించి అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నారు రేషన్ సిండికేట్ గాళ్ళు.గ్రామాల్లో కిలో రూ.10 కొనుగోలు చేసి,అధిక ధరకు అమ్ముతునాచోద్యం చూస్తున్నారు సంబంధిత అధికారులు.చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో ధర్మాజీగూడెం,కలరాయనగూడెం, నరసన్నపాలెం,బొల్లెరేగూడెం రంగాపురం,భోగోలు,సింగగూడెం,కొత్తపల్లి,పాత్స్య నగరం,వంటి గ్రామాల్లోకి రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, సిండికేట్ గా ఏర్పడి కొందరు వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.కొందరు వ్యాపారులు కార్డుదారుల నుంచి,రేషన్‌ డీలర్ల నుంచి తక్కువ ధరలకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు.పీడీఎస్‌ బియ్యంను అధిక ధరకు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఊరి చివర ఉన్న ఇల్లు,అడవే అడ్డాలుగా చేసుకునిజిల్లాలో పీడీఎస్‌ బియ్యం దందా కొనసాగుతోంది.అక్రమ రవాణాదారులు సిండికేటుగా ఏర్పడి,రేషన్‌ బియ్యాన్ని ద్విచక్రవాహనాలు,ఆటోలు, టాటాఏసీ,ఇంట్రా,బడా దోస్త్ వాహనాలల్లో బియ్యం బస్తాలను తీసుకువచ్చి పాత రైస్‌మిల్లులు,రోడ్డు సౌకర్యం ఉండి ఊరు చివరన ఉన్న ఇళ్లలో,అడవి ప్రాంగణాల్లో అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని, డంప్‌ చేసి , భారీ మొత్తంలో డంప్ చేసిన తర్వాత రాత్రి సమయాలల్లో టర్బో లారీల్లో,ఐషర్ వ్యానల్లో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు మొన్న చాట్రాయి ఇటీవల పీఠాపురం ప్రాంతంలో పట్టుబడిన పెద్ద ఆటో ల ను చూస్తే అర్థం అవుతుంది.లింగపాలెం మండలం వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో కొందరు సిండికేటుగా ఏర్పడి రేషన్‌ బియ్యాన్ని రూ.9 నుంచి రూ. 10కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రూ. 26నుంచి రూ. 29లకు అధిక ధరలకు విక్రస్తున్నారు.బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులకు కొందరు రేషన్‌ డీలర్ల మద్దతు ఉండడం వల్లనే భారీ స్థాయిలో పీడీఎస్‌ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఇంత జరుగుతున్న పీడీఎస్‌ అక్రమ దందాపై సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ,ఈ అక్రమ రవాణా వ్యాపారం నిలువరించేందుకు అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యము పాటు వారి కంట్లో పడిన కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది,అందువల్లనే అక్రమ దందా ఆగడాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఇదంతా ఈ ప్రభుత్వం లో ఉన్న అధికార యంత్రాంగంకు తెలియదా అంటే మామూళ్ల మత్తుతో నిద్రాణం లోక్ నిఘా వ్యవస్థ పోగా మాకెందుకులే అని మౌనంగా విజిలెన్స్ ,ఏ సంచి ఎటు పోతే మాకెందుకు మా సంచి నిండిందా లేదా అని సివిల్ సప్లై అధికారులు ఉండబట్టే ఇలా మాఫీయా చెలరేగి పోతుందనే చర్చలు జరుగుతున్నాయి.కూటమి ప్రభుత్వం లో కోటా బియ్యం కోకొల్లలు గా కొటేస్తున్నా కట్టడి చేసే నాధుడు లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇకనైనా ఈ అక్రమ దందాకు, అక్రమ వ్యాపారం అధికారులు వంత పడకుండా వీటి నిలువరించి ప్రభుత్వ ఆశయానికి ఆదాయానికి మేలు చేయాలని పలువురు కోరుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article