Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedచదువుతోపాటు,సేవా భావంతో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

చదువుతోపాటు,సేవా భావంతో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

పులివెందుల
విద్యార్థినీ,విద్యార్థులు సమాజంలో ఉన్నత లక్ష్యా లతో ముందుకు సాగాలి అని కౌన్సిలర్ మూలి. మహేశ్వర్ రెడ్డి అన్నారు బుధవారం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా ఆఖరి రోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. వై . నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో వైయస్ వి ఆర్ ఎం కాలేజ్ విద్యార్థిని లు అయిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దత్తత గ్రామమైన బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థినిలకు ఆటలపోటిలలో గెలుపొందిన వారికి బహుమతుల ను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ జీవితంలో ఆస్తి అంతస్తులు పోతాయేమో గాని చదువుకునే విద్య మాత్రం శాశ్వతం అన్నారు విద్యార్థినీ,విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు విద్యార్థు లను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థినులకు ప్రమాణ పత్రాలను అద్యాపకులు రవి , విజయ్ కుమార్ రెడ్డి సార్ ,రామ మోహన్ రెడ్డి ,విజయ లక్ష్మిల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. వై . నాగేంద్రమ్మ ను కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యా యులు,విద్యార్థులు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article