టిడిపి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి
ప్రజాభూమి, వేంపల్లె
నవ్యాంధ్రరూపకర్త, మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని టిడిపి వేంపల్లె మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కుమ్మరాంపల్లి మరియు మారుతి నగర్ లో మండల కన్వీనర్ రామమునిరెడ్టి, సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్, రెడ్డయ్య, బాల నర్సింహులుతో కలిసి ఆయన బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజల్లోకి వైకాపా ప్రభుత్వ పాలన తీరు మరియు టిడిపి మేనిఫెస్టోను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి అన్యాయాలు, అక్రమాలు, విధ్వంసాలు, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు ఎక్కువయ్యాయన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలు, పాలనను పక్కన పెట్టిందని, అన్యాయాలను ఎదురించే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయని, దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ప్రస్తుతం యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, తిరిగి రాష్ట్రం ప్రగతి దిశగా అడుగులు వేస్తోందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, చంటి, రామాంజనేయులు, రమణ, పెద్దింటి లక్ష్మణ్, చెండ్రాయుడు, పోతిరెడ్డిశివ, బాబా, భాను, కిరణ్, కృష్ణ, ఈశ్వరయ్య, రామగంగిరెడ్డి, ఆర్వీ రమేష్, మడక శ్రీను, శ్రీరామరెడ్డి, వీరభద్ర, గండి దైవస్థానం మాజీ ఛైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.