Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుచంద్రబాబు దగాకోరు.. పయ్యావుల బ్లాక్ మెయిలర్

చంద్రబాబు దగాకోరు.. పయ్యావుల బ్లాక్ మెయిలర్

  • హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు
  • పూర్తి చేసిన ఘనత వైఎస్సార్ దే
    కేశవ్ ఒక బ్లాక్ మెయిలర్, కోతలరాయుడు
  • ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి.. కేశవ్ అడుగడుగునా అడ్డుతగిలాడు
  • విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం

అనంతపురము
“మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఒక దగాకోరు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బ్లాక్ మెయిల్, మోసగాడు” అని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు.
శనివారం ఉరవకొండలో టిడిపి నిర్వహించిన “రా.. కదలిరా..” బహిరంగ సభలో చంద్రబాబు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్, ఇతర వైసిపి ఎమ్మెల్యేలపై ఆరోపణలు గుప్పించడంపై మండిపడ్డారు. ఆదివారం అనంతపురంలోని జిల్లా వైస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఈ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాతో కలసి వై.విశ్వేశ్వరరెడ్డి
విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకే సభలు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవుకాటకాలు ఏర్పడ్డాయని,
హంద్రీనీవా ప్రాజెక్టును నేనే తెచ్చానంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని,
హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు అని,
ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత వైఎస్సార్ దే” అని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచిన ఘనత కూడా మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డిదేనన్నారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓ మోసగాడు అని వై.విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. “హంద్రీనీవా నుంచి జిబిసికి నీరిస్తుంటే అడ్డుపడిన దుర్మార్గుడు కేశవ్. ఈయనొక బ్లాక్ మెయిలర్, కోతలరాయుడు, ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి అడుగడుగునా అడ్డుకున్నాడు” అని శివాలెత్తారు. చంద్రబాబు అంత పచ్చి మోసగాడు.. దగాకోరు.. ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. జగన్ బాధితులంతా నా స్టార్ క్యాంపైనర్స్ అంటున్నారని.. పెత్తందార్లు, దళారీలు, బ్రోకర్లు మీకు స్టార్ క్యాంపైనర్లని వై.విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దెవా చేశారు. ఉరవకొండకు సీఎం జగన్ వచ్చిన సమయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే గురించి విమర్శించలేదన్నారు. కానీ చంద్రబాబు.. ,”మా ఎమ్మెల్యేలు, చివరకు మా కుమారుడిని కూడా విమర్శించారను” విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నిన్నటి (శనివారం) ప్రసంగం చూస్తే ఆయన కోతల రాయుడు అనేది స్పష్టం అవుతోందన్నారు. వర్షాభావ పరిస్థితులతో, కరవు సమయంలో హంద్రీనీవా నుంచి జిబిసి రైతులకు నీరు ఇస్తుంటే అడ్డుపడింది పయ్యావుల కేశవ్ అని విమర్శించారు. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడని విమర్శించారు. హంద్రీనీవా నిర్మాణం, నీటి విషయంలో కేశవ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. 40 టీఎంసీల హంద్రీనీవా ను 5 టీఎంసీల కుదించి జీవో ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ తరువాత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక, దాన్ని 40 టీఎంసీలు చేస్తూ జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తెచ్చిన ఘనత మహానేత రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేశారు. మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే : మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర్ నారాయణ
హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు రూ.9 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్ రూ.6,500 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారని వై.విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఉరవకొండ సభలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు.
చంద్రబాబు-కరవు కవల పిల్లలు
చంద్రబాబు అధికారంలోకి వస్తే దుర్భిక్షం వస్తుందన్న నమ్మకం రైతుల్లో ఉందని, రెయిన్ గన్స్ పేరుతో రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన అన్నారు. సీఎం జగన్‌ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article