కడప అర్బన్
కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో దేవుని కడప నకాష్ నాగరాజ్ పేట సాయిపేట శంకరాపురం తదితర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి రెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపించాలని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బలిజ సంఘం నాయకుడు ఎద్దుల శంకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చిన ఐదు పర్సెంట్ ఈ బీసీ రిజర్వేషన్లను తప్పకుండా అమలవుతుందని బలిజలకు ఉద్యోగాలలో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి ప్రతాప్ మాట్లాడుతూ బలిజలు ఎక్కువమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని సురేష్ బాబు గాని అహమ్మద్ భాష గాని బలిజలంటే చిన్నచూపు చూడడంతో బలిజ సోదరులు పూర్తిగా వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, వైసీపీ లో ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఎస్సీ సెల్ నాయకుడు సుదీర్ మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎస్సీలకు మంచి న్యాయం జరుగుతుందని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల మీద ఎక్కువ దాడి జరిగిందని అందువల్లనే ఎస్సీలంతా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తి రవీంద్ర, గంప వీరయ్య, ఆడవాల రాజా, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

