ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
— పరస్పర ఆలింగనంతో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసిన వైనం
— వైఎస్ఆర్సీపీప్రభుత్వం
తోనే ముస్లింలకు భరోసా
చంద్రగిరి:పవిత్ర రంజాన్ పండగను ముస్లింలు చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర, సోదరీమణులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈద్ ముబారక్ తెలియజేశారు.
చంద్రగిరి సమీపంలోని రెడ్డి వారి పల్లి ఈద్గా మైదానం చేరుకున్న తుడా ఛైర్మెన్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకుముందు ముస్లింలు మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.. షాల్, టోపీతో సత్కరించారు. ముస్లిం సోదరులతో పరస్పరం ఆలింగనం చేసుకుని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరినీ చేతిలో చేయి వేసి పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. ముస్లింలు కూడా ఆప్యాయతను కనబరిచారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించి రంజాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
మాట్లాడుతూ.. మానవాళికి క్రమశిక్షణ, ధర్మాన్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండగ రంజాన్ అని కొనియాడారు. చంద్రగిరి నియోజకవర్గం భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉందన్నారు. హిందువులు, ముస్లింలు సోదర భావంతో మెలుగుతామని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా రంజాన్ వేడుకల్లో కలిసి మెలసి పాల్గొంటామని తెలియజేశారు. సీఎం జగనన్న ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో రూ.1.66 కోట్లతో షాదీ మహల్ నిర్మాణం శరవేగంగా సాగుతుందన్నారు. అలాగే తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో రూ.30 లక్షలతో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. చంద్రగిరిలోని 16 వేల ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏటా రంజాన్ కానుకలు అందజేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధ్యం కాలేదన్నారు. అలాగే 75 మసీదుల్లోని మత గురువులకు తగిన గౌరవం ఇచ్చామన్నారు. ముస్లింలకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులకు భరోసాగా ఉంటుందని, ఆయనే సీఎం కావాలని ముస్లింలు ముక్తకంఠంతో కోరారు. 2024 ఎన్నికల్లో సీఎం జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని ముస్లిం పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలును చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోరారు.
