- చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఆర్ ఎస్ మస్తాన్ వైసీపీలో చేరిక..
- వైసీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి..
- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానికి కష్టపడి పనిచేస్తానన్న ఆర్ ఎస్ మస్తాన్..
చంద్రగిరి:
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం (1983) నుంచి పార్టీ కార్యకర్తగా పని చేస్తూ ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గ టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడుగా వున్న ఆర్ ఎస్ మస్తాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆది నుంచి తెలుగు దేశం పార్టీకి వీరాభిమానిగా ఉంటూ ఆ పార్టీకి సేవలు అందించిన ఆర్ ఎస్ మస్తాన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి కులం, మతం, పార్టీ, ప్రాంతం అన్న తేడాలేకుండా అభివృద్ధి పనులు చేయడం పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించిన మస్తాన్ వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కరుడు కట్టిన టీడీపీ అభిమాని ఆర్ ఎస్ మస్తాన్ వైసీపీలోకి రావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు చేగు ప్రశాంత్ గుప్తా, చంద్రగిరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ చేగు గోవర్ధన్ గుప్తా, చంద్రగిరి సర్పంచ్ భర్త రామ్మూర్తి, చంద్రగిరి మండలం వైసీపీ నేతలు మస్తాన్, బుల్లెట్ చంద్రమౌళి రెడ్డి , డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రవీణ్,
యారాశి చంద్రశేఖర్ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి లు అభినందించారు.