Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుచంద్రగిరి స్మశాన వాటికలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బడి సుధా యాదవ్..!

చంద్రగిరి స్మశాన వాటికలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బడి సుధా యాదవ్..!

చంద్రగిరి:
నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలోని స్మశాన వాటికలో గల్లా అరుణ కుమారి అనుచరుడు రాష్ట్ర ఓబిసి పోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండడంతో వారి సమాధులకువినతి పత్రం తో పాటు తాయిలాలు వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థన చేశారు. గెలిచిన తర్వాతసమాధులకు స్టైల్స్ వేసి షెల్టర్ కట్టిస్తాననివ్యంగంగా ఎన్నికల హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు చనిపోయిన కూడా ఓటర్లేనా? ఇది చాల విడ్డూరంగా ఉందన్నారు. ఇదేవిధంగా నియోజకవర్గంలో 35 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదైనదీనిపై అధికారులు చర్యలు ఉండవా?అధికారులుకళ్ళుతెరిపించడానికిప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తానని .కార్యక్రమంలో ఎస్ వి యూనివర్సిటీ టీఎన్ఎస్ఎఫ్ మాజీ ప్రెసిడెంట్ నాగార్జునయాదవ్ , మునిరత్నం,మునిరత్నం, వినోద్, నీలకంఠం, సాయి తదితరులుపాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article