Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుగ్రామీణ భారత్ బంద్ విజయవంతం

గ్రామీణ భారత్ బంద్ విజయవంతం

కలసపాడు : కలసపాడు మండలంలో ని డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని మోడీ ప్రజా రైతు వ్యవసాయ రంగాల్లో తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలకు నిరసన గా సిఐటియు అంగన్వాడి ఉపాధి కూలీలు బేల్దారులు రైతులు అందరూ కలిసి గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సగిలి గురయ్యా, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ సిఐటియు జిల్లా సభ్యురాలు విజయమ్మ ఏఐటియుసి జిల్లా కన్వీనర్ సునీల్ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి సుదర్శన్ బేల్దారుల సంఘం పేరయ్య ,కార్మిక వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు హుస్సేన్ పీరా, సాల్మన్ ,చిన్నప్ప, దళిత పోరాట సంఘం అధ్యక్షుడు సగిలి రాయప్ప డిఎస్ పి ఎస్ మహమ్మద్ భాష నారాయణ లు, పలు ముఖ్య సమస్యల పైన మాట్లాడుతూ అంగన్వాడీలకు 26,000 ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కార్మిక చట్టాలను 44 చట్టాలు నీ ఉపసరించాలని నిత్యవసర ధరలను తగ్గించాలని కార్మిక చట్టాలు 8గంటల పని 12 గంటలకు పెంచిన దాని తగ్గించాలి ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచాలి వేతనం రూ 600 పెంచాలని రెండు పూటల పని ఆన్లైన్ మాస్టారు రద్దు చేయాలి బేల్దారులకు వారి హక్కులు కల్పించాలి పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తున్నారనీ బిజెపి ప్రభుత్వం మనకు బానిస బతుకులకు అప్పగిస్తూన్నారనీ, కార్పొరేటర్లుకు కట్టబెడుతున్నారనీఅలాగే కార్మిక చట్టాలు కూడా కాల రాస్తున్నారనీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సగిలి గురయ్య ఏఐటియుసి పాల్గొన్నవారు సిఐటియు జిల్లా సభ్యురాలు విజయమ్మ కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి సుదర్శన్ బేల్దారుల సంఘం పేరయ్య జిల్లా ఉపాధ్యక్షుడు వ్యవసాయ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు హుస్సేన్ పేరా సల్మాన్ చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article