రైతులను మోసం చేసిన మోదీ
ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాల
పోరుమామిళ్ల:
సీపీఐ, సిపిఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసి,కార్మిక,రైతు,వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగం గా కడపజిల్లా పోరుమామిళ్ళ అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారత ప్రధాని మోడీశవయాత్రగావించారు.ఈసందర్భంగా మోడీ డౌన్ డౌన్ నినాదం చేస్తూ, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈసందర్భంగాఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్.భైరవ ప్రసాద్,సీపీఐ మండల కార్యదర్శి రవికుమార్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ…. కేంద్రంలోమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాల వలన రైతుల పాలిట ఉరితాడులుగా మారాయ న్నారు.ఐదుఏళ్లలో 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డార ని, మోడీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ మూలంగా పరిశ్రమల్లో సంపద సృష్టించే కార్మికులను ఏ హక్కులు లేని బానిసలుగా మార్చాయ న్నారు.కేంద్ర, రాష్ట్ర సంస్థలలో 23లక్షల ఉద్యోగాలుఖాళీగా ఉన్నా యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ భారత్ గావెలిగిపోతుందనివిమర్శిం చారు.మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల ప్రతిరోజు ధరలు పెరుగుతున్నా యని, నిత్యవసర వస్తువులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేని కారణంగా పౌష్టికాహారం లోపంచి ఆకలి చావులు పెరిగాయన్నారు. ఎన్నడూ లేనివిధంగాభారత దేశంలో పేదరికం పెరిగిందని, వీటిని పరిష్కరించ లేని మోడీ ప్రభుత్వా న్ని గద్దె దింపే వరకు ప్రతి ఒక్కరు సైనికుల వలె పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.కార్మికులకు, చట్టా లు నిర్వీర్యం చేయడం, రైతులకు నల్లచట్టాలు తీసుకురావడం, విద్యార్థుల , యువతకు, ఉద్యోగ ఉపాధి కల్పించకపోవడం , జీఎస్టీ పేరుతో ప్రజలను చంపడం, కులాల, మతాల,ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ముస్లిం మైనారిటీ వారికి ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న నరేంద్ర మోడీని గద్దె దింపే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు
సపా, పిరయ్య, వెంకటేశ్వర్లు, రవీంద్ర, ఆటో నాయకులు , ప్రభాకర్, చంద్ర,, జ్యోతి, మహబూబ్ చాంద్, గురమ్మ, సుబ్బు, శ్రీనివాసులు,, సిఐటియు మండల కార్యదర్శి చిన్నయ్య, సుందరం, రవి,, ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రసాదు, ఐద్వా సంఘం మండల నాయకురాల్లు బీబి ,లూర్దు మేరీ, గురయ్య , అధిక సంఖ్యలో మహిళలు కార్మికులు రైతులు పాల్గొన్నారు.