పుట్లూరు. పుట్లూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ నందు సోమవారం ఎస్ఐ హేమాద్రి గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హేమాద్రి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఏ పార్టీ వారు గెలిచిన గ్రామాలలో బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేయకూడదని గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత జీవితం గడపాలన్నారు ఎవరైనా గొడవలకు వెళితే ఎంతటి వారినైనా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందన్నారు గ్రామంలో గొడవలకు వెళ్లే ముందు తమ భార్య పిల్లల గురించి ఆలోచించి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని వారికి సూచించారు