పత్రికా రంగంలో సుధీర్ఘ కాలంగా ప్రజాసమస్యలపై పోరాడుతు ఎన్నో మరెన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటు నిరంతర పోరాటం చేస్తున్న ప్రజాభూమి దినపత్రిక ఎప్పుడో చెప్పింది…వాస్తవాలను నిర్బయంగా ప్రజల ముందు ఉంచుతూ నిజాయితీగా ప్రజల పక్షాన నిలుస్తుంది.బెజవాడ పట్టణం కౌతాలం లో కళాకారుల పై జరుగుతున్న కుట్రలపై కళామతల్లి కి జరుగుతున్న ఘోర పరాభవం పై ,సాటి కళాకారులపై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను వెలికి తీసి బహిర్గతం చేయడం మొదలు పెట్టిన మొదటి ప్రయత్నం లో ఎన్నో బెదిరింపులు దాడులు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
ఓ కళాకారుడిపై దాడి చేసి బెదిరించిన వారి కున్న కుంటి..ఆ..లను చూపెట్టి.. నీచాతి నీచంగా ప్రవర్తించిన తీరును తనను కాపాడమని పోలీసులను కోరిన స్పందించక పోగా సదరు కళాకారుడి ఫిర్యాదును చెత్తబుట్ట దాఖలు చేసిన పోలీసుల తీరును చూసి ఇదేనా ప్రేండ్లీ పోలీస్ అనిపించింది.
తప్పు చేసిన వారు డబ్బు,హోదా ఉన్నందున ఓ దళిత,పేద కళాకారుడి పై పైశాచిక చర్యలకు పాల్పడిన వారిని కనీస ధర్మం ప్రకారం హెచ్చరించకపోగా ఫిర్యాదుదారునినే దోషిగా చేసిన వైనాన్ని కూడా వెల్లడించింది ప్రజాభూమి దినపత్రిక…ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పాత్ర పోసించాల్సిన అధికారులు లే అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారన్న అపవాదు మూటకట్టు కుంటున్నారు.ఇప్పటికయినా ఈ అధికారులు నిజాలు తెలుసుకుని న్యాయాన్ని కాపాడకపోయిన అన్యాయానికి అండగా ఉండకూడదని ప్రజాభూమి దినపత్రిక ఆశిస్తోంది..