: *బిల్డిండ్ బ్రోకర్ భార్గవ్ గాడి ఆటలకు అంతం లేదా…
*అవినీతి తిమింగలం గంధం ప్రసాద్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయా. .
*నేతి మాటలు ..నీతి లేని చేష్టలా…
*ఈ బ్రోకర్ గాడితో కారం కు ఉన్న లింకేంటీ…
*వట్టూరి వారి వీధి లో అక్రమ నిర్మాణాలకు నియమాలు లేవా…
మార్వాడి గుడి ప్రక్కన ఉన్న మాయాజాలమేమిటీ…
*గుంటూరు కారం కు బ్రోకర్ బేరాలు బాగా కుదిరాయా…
*ప్లానింగ్ సెక్రెటరి పక్కాగా ప్లాన్ అమలు చేసారా…ప్లాన్ వేశాడ…
*బ్రోకర్ తో బాయి భాయి అనుకున్నారా…
*అసలీ బ్రోకర్ గాళ్ల కు బిల్డింగ్ తో సంబందం మేమిటీ…
*మున్సిపల్ అధికారుల కళ్లకు మబ్బులు కమ్మాయా…
*ఈ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేదేవరు…
*గుంటూరు కారం.. బ్రోకర్ చేసిన పనేంటీ…
(రామమోహన్ రెడ్డి)
కంచె చేను మేసిందన్న చందంగా బెజవాడ కార్పొరేషన్ అధికారుల తీరు ఉంది. అక్రమ కట్టడాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులే తమ అడ్డగోలు తనానికి అడ్డంగా బ్రోకర్లను నియమించుకుని భారీ దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల వేతనాలు ప్రభుత్వం ద్వారా తీసుకుంటూ కూడా అక్రమ వసూళ్ల పై ఆశ చావక అడ్డగోలు నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ లోపాయకారి ఒప్పందాలు చేసుకుని అప్పనంగా దోచుకుని తినడానికి ఏమాత్రం వెనుకాడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నా కూడా అవేమి పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ప్రజలు అసహ్యపడుతున్నారు.
బెజవాడ లోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ని వ ట్టూరి వారి వీధి, చలమరాజు వీధి, దలవాయి సుబ్బయ్య పాఠశాల ప్రక్క వీధిలో జరుగుతున్న నిర్మాణాల అనుమతులు బిల్డింగ్ బ్రోకర్ భార్గవ్ నేతృత్వంలోఇచ్చారని పట్టణ ప్రణాళిక విభాగం లోని కొంతమంది కింది స్థాయి సిబ్బంది చెప్పకనే చెప్పు కొస్తున్నారు.
ఈ బీల్డింగ్ బ్రోకర్ నిర్మాణ దారుల నుండి భారీగా ముడుపులు రాబట్టి నీకింత నాకింత అనే విదంగా టిపిఓ, బీల్డింగ్ ఇన్స్పెక్టర్ లకు వాటాలు చెల్లించి అడ్డగోలు నిర్మాణాలు దగ్గరుండి చేయిస్తున్నట్లు అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి.: పేరుకు నేతాజీ ఉన్నా ఈ నీతి లేని పనుల్లో వాటాలు తీసుకుని టిపిఓ కూడా కొంతముట్టజెప్పి తనకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరయితే బీల్డింగ్ బ్రోకర్ భార్గవ్ ఉన్నాడో అతనే అధికారులకు లంచాలు పడేసామని ఎవరు ఎన్ని రకాల ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు ఉండరని అక్కడక్కడ గొప్పలు చెప్పుకుంటున్నా రనే విషయాలు బైటికి వస్తున్నాయి.ఇలాంటి అధికార వ్యవస్థ ఉండగా అక్రమ కట్టడాలు ఎలా అగుతాయని అక్కడి ప్రజల నుండి విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికయిన ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలు కూల్చి పై ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తారా అబ్బే అవేమి పట్టించుకోకుండా ఉంటారా అన్నది వేచిచూడాలి మరి.