హిందూపురం టౌన్ :సామాజిక మీడియాలో దుష్ప్రచారంపై మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని బుధవారం రాత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిర్వహించారు. హిందూపురం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు . కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ,వమాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకురాలు మధుమతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ పేద కుటుంబంలో జన్మించి, ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకర మన్నారు. ఇటీవలే గీతాంజలి తనకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు కావడం పట్ల, అమ్మఒడి పధకం ద్వారా లబ్ధి పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేయడాన్ని భరించలేని టీడీపీ , జనసేన కార్యకర్తలు ఆమెను కాకుల్లా పొడిచి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి, హింసించి చివరికి తను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల చెక్కును కూడా అందించారని , అలాగే వారి పిల్లల చదువు కూడా ప్రభుత్వం భరించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు. గీతాంజలి కుటుంబానికి అన్ని విధాలా పార్టీ అండగా నిలుస్తుందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు,మార్కెట్ యాడ్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్,వైస్ చైర్మన్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల,టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కన్వీనర్లు ,వార్డు ఇన్చార్జులు, వార్డు మెంబర్లు,కో ఆప్షన్ మెంబర్స్, సింగిల్ విండో అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు,వైసిపి నాయకులు, కార్యకర్తలు,గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు.