మొదటి నుండి ప్రత్యేకమైన చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడుమాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన . అతని రాబోయే చిత్రం గామి కూడా ఇలాంటిదే. విభిన్నమైన కథాంశం ఇది. ఇందులో అతడు అఘోరాగా నటిస్తున్నాడు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా సినిమా ప్రమోషన్‌లను ప్రారంభించారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించాడు. మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ వదిలారు. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుని, మేకర్స్ తేదీని లాక్ చేశారు. అయితే గామి రాకతో, విశ్వక్ సేన్ మరో చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పుడు మార్చి 8న రేసు నుండి తప్పుకున్నట్టయింది. ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను మార్చి 8కి ప్రకటించారు. గామి రావడంతో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి వాయిదా పడినట్టయింది. గామి విషయానికొస్తే… ఈ చిత్రంలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నాడు. “అతని అతి పెద్ద భయం, మానవ స్పర్శ… అతని గాఢమైన కోరిక, మానవ స్పర్శ కూడా” అనే లైన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.