ఒంటిమిట్ట:ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను రాజంపేట టిడిపి నేత పోలి సుబ్బారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కల్లుగీత మాజీ స్టేట్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య బుధవారం కోదండ రాముని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శిల్ప సంపదను తిలగించారు. అర్చక స్వామివారు ఆలయ విశిష్టతను వివరించారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత కొమర వెంకట నరసయ్య,, వినోద్ రెడ్డి, హరి రాయల్, బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ సుభాన్,గొల్లపల్లి నరసింహులు, మధు, సుబ్బారెడ్డి, చాలా బాద్ శేషారెడ్డి,షేక్ నఫీ ఉల్లా, తిరుపాల్, రాజు, మండల పరిధిలోని టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
