బాలయ్య గెలుపే ప్రధానంగా కృషి చేద్దాం.
టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
లేపాక్షి : తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేపాక్షి మండల పరిధిలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం మండల పరిధిలోని కోడిపల్లి గ్రామంలో మండల టిడిపి కన్వీనర్ జయప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు ఈ ఆరు పథకాలను కూడా నియమిత సమయంలోనే అమలు చేయనున్నట్లు ప్రజలకు వారు తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ జయప్ప, సిరివరం క్రిష్టప్ప, రామాంజి నమ్మ, మారుతి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ,, తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యాయన్నారు. విద్యా వైద్య రంగాల్లో తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి మరే ముఖ్యమంత్రి చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 ఏళ్ళు కావస్తున్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదన్నారు. చివరకు గ్రామీణ ప్రాంతా రహదారులు కూడా వేయలేని పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలను నిర్దిష్ట కాలంలోనే అమలు చేసే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ పాలన లోకి వచ్చేందుకు ఒక సైనికుడిలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్, ఎంపీటీసీ గంగాధర్, నాయకులు నాగలింగారెడ్డి, నాగరాజు, జయ కృష్ణారెడ్డి, సడ్లపల్లి అస్వర్త నారాయణ, గంగిరెడ్డి, సదాశివరెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, ఈడిగ రమేష్ లతోపాటు పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.