మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం శుభ పరిణామం అని .. కొణతాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు.