ఏలేశ్వరం:- భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు పిలుపు మేరకు మూడు రోజుల పాటు నిర్వహించే పల్లెకు పోదాం కార్యక్రమాన్ని ఆ పార్టీ శ్రేణులు ఇందులో భాగంగా శుక్రవారం 7 వ వార్డులో బీజేపీ శ్రేణులు ప్రవాసీ యోజన ద్వారా ఇంటింటికీ వెళ్లి మోడీ సారథ్యం లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 7 వ వార్డు బీజేపీ ప్రవాసి సంయోజక్ వెలుగూరి హరే రామ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని,పేద ప్రజల కోసం ఉచిత బియ్యం,మహిళకు ఉచిత గ్యాస్,ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ద్వారా ఇళ్ళు కట్టించడం,ఇంటింటికీ ఉచిత మంచి నీటి కుళాయిలు,రైతులకు పి యమ్ కిసాన్ సమ్మాన్ నిధి, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రైతులకు అతి తక్కువ ధరలకు నానో ఎరువులు అందించడం,డ్వాక్రా గ్రూపు మహిళలకు 20 లక్షల వరకు రుణ సదుపాయం వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కాకినాడ జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్,టౌన్ అధ్యక్షులు రెడ్డి లోవరాజు,మండల అధ్యక్షులు కూరాకుల రాజా,జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిం వెంకట రమణ,ఏనుగు ధర్మరాజు,గంగాధర్,దుర్గ పాల్గొన్నారు.