రామచంద్రపురం ఆర్డీవోకు టిడిపి, జనసేన నేతలు వినతిపత్రం.
రామచంద్రపురం :కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో లెక్కింపు లో పలు అంశాలపై తీసుకన్న నిర్ణయాలపై రామచంద్రపురం టీడీపీ, జనసేన నేతలు ఒక వినతిపత్రం అందజేశారు. ఈమేరకు సోమవారం రామచంద్రపురం ఆర్డీవో, రిటర్నింగ్ అదికారి అయిన సుదాసాగర్ కు రామచంద్రపురం టౌన్ టీడీపీ అద్యక్షులు కడియాల రాఘవన్ రామచంద్రపురం టౌన్ జనసేన జనరల్ సెక్రటరీ సత్యవాడ శ్రీ హారీ పంతులు సంయుక్తంగా ఒక వినతిపత్రం అందజేశారు. పోస్టల్ బేలట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్వో పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో జరిగిన నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ వివరణ ప్రకారం ఉద్యోగులు, సర్వీస్ అధికారులు, ఇతర వ్యక్తులు నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు పై సూచనలలో,
ఆర్వో సీల్ లేకున్నా, ఓటు లెక్కించాలని సంతకం ఉంటే చాలు.అలాగే
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని సీల్ లేకున్నా ఓటును లెక్కించాలని, ఫామ్ 13ఎ పై ఆర్ వో సంతకంతో సహా పూర్తి వివరాలు ఉంటే సీల్ లేకున్నా ఓటును లెక్కించాలని,పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్ తో సరిపోల్చుకుంటే చాలని ,అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫార్మ్ బి
(ఫామ్ 13 సి) పై ఓటర్ సంతకం లేదన్న కారణంతో కూడా బ్యాలెట్ ఓటును తిరస్కరించరాదని ,
అలాగే పోస్టల్ బ్యాలెట్ లోపల కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి తిరస్కరణలకు తావులేదని తాజాగా పలు అంశాలపై
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ మార్గదర్శకాలు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రామచంద్రపురం నియోజకవర్గ రిటర్నింగ్ అదికారిగొ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వీరు తమ వినతిపత్రంలో వివరించారు. అయితే ఆర్డీవో సమక్షంలో పలుమార్లు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశంలో వీరికి అప్పట్లో పోస్టల్ బేలట్టుపై వివరణలు ఇవ్వడంజరిగింది. అయితే ప్రస్తుతం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బేలట్ ఓట్లపై నిర్ణయంలో పలు చూచనలు విషయంపై ఈరోజు వీరు వినతిపత్రం అందజేసినట్లు జనసేన రామచంద్రపురం టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీహరి పంతులు తెలిపారు.