కామవరపుకోట:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించడంతోపాటు మహిళలు అన్ని రంగాలలోనూ రాణించాలని సూచించారు. అనంతరం మహిళా అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మానం అనంతరం పలువురు అధ్యాపకులు వివిధ వృత్తుల గురించి మాట్లాడారు. స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. మేము ఈ సన్మానం పొందడానికి గతంలో అనేకమంది చేపట్టినటువంటి సంస్కరణలే నేడు మేము ఈ సన్మానం పొందగలిగామని వారన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు, ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, వి శ్రీనివాస్, ధారావతు మల్లేష్, ఆఫీస్ సిబ్బంది రత్న సిరిలో , కుమార్ రాజా లతోపాటు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.