గత రెండు రోజులుగా తమిళనాడులోని పలు ఆలయాలు, రామేశ్వరం.. ప్రాంతాలను సందర్శించారు ప్రధాని మోదీ . అలాగే పలు కార్యక్రమాల్లో కిడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను కూడా కలిశారు. సీనియర్ నటి కుష్బూకూడా బీజేపీ(BJP) పార్టీ నాయకురాలు అని తెలిసిందే.
మోదీ తమిళనాడుకు రావడంతో సీనియర్ నటి కుష్బూ ఆయన్ను కలిసింది. అయితే కుష్బూతో పాటు ఆమె అత్తగారు దేవనై చిదంబరం పిళ్ళై కూడా మోదీని కలిశారు. మోదీ.. కుష్బూ అత్త గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆవిడ మోదీని చూసి చాలా సంతోషించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను కుష్బూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది
తన అత్త వద్దనుంచి మోదీ ఆశీర్వాదాలు తీసుకునే ఫొటోలు షేర్ చేసి.. మోదీ గారికి అభిమాని అయిన మా అత్త శ్రీమతి దేవనై చిదంబరం పిళ్ళై ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలంటే మాటలు కూడా సరిపోవట్లేదు. మోదీ గారిని ఒక్కసారైనా కలవాలి అనేది ఆమె లైఫ్ డ్రీం. వరల్డ్ పాపులర్ లీడర్ అయిన మన మోదీ గారు ఆవిడని చాలా సాదరంగా ఆహ్వానించారు. ఒక కొడుకు తల్లితో మాట్లాడినట్టు మాట్లాడారు. మా అత్తగారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. మిమ్మల్ని కలవడం మర్చిపోలేనిది. మా అత్తయ్య కళ్ళల్లో చిన్నపిల్లలా ఆనందం చూశాను. ఈ వయసులో ఆమెని ఇలా సంతోషంగా చూడటం కంటే ఏది ఎక్కువ కాదు. మీకు ఎప్పటికి రుణపడి ఉంటాము మోదీజీ అని పోస్ట్ చేశారు కుష్బూ.