హైదరాబాద్ లో కుమారి ఆంటీ హోటల్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు అడ్డుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ హోటల్ పై కేసులు ఎత్తివేయాలని ఆదేశించడం తెలిసిందే.ట్రాఫిక్ పోలీసుల పర్మీషన్ తో.. జనవరి 31వ తేదీ మధ్యాహ్నం హోటల్ ఓపెన్ చేసింది కుమారి ఆంటీ.. ఈ విషయం తెలుసుకున్న జనం.. భోజనం చేసేందుకు ఎగబడ్డారు. వందల సంఖ్యలో ఫుడ్ కోసం తరలివచ్చారు.కుమారి ఆంటీకి మద్దతు పలికారు. కుమారి ఆంటీ హోటల్ మళ్లీ తెరిచారు అన్న విషయం తెలిసిన వెంటనే.. రోజుకు కంటే ఎక్కువగా జనం తరలి వచ్చారు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కుమారి ఆంటీ హోటల్ ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది .

