Thursday, February 12, 2026

Creating liberating content

సినిమాకిరణ్ అబ్బవరం “దిల్ రూబ”‌

కిరణ్ అబ్బవరం “దిల్ రూబ”‌

కొత్త ఏడాదిలో సరికొత్తగా మనముందుకు రానున్నాడు యువ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓకె చేశాడు. ఈ సినిమాకి “దిల్ రూబ”‌ అనే పేరు ఖరారు చేశారు.ప్రముఖ ఆడియో కంపెనీ సరేగమా, శివమ్స్ సెల్యులాయిడ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ నటిస్తోంది .ఆ మధ్య వరుసగా సినిమాలు విడుదల చేశాడు. సినిమాల పంథా మార్చాలని గ్యాప్ తీసుకున్నాడు. ఒక మంచి హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.కిరణ్ ఇంతకుముందు “రాజావారు రాణిగారు”, “రూల్స్ రంజన్”, “SR కల్యాణ మండపం”, “వినరో భాగ్యము విష్ణు కథ”, “సమ్మతమే” వంటి చిత్రాలు చేశాడు. మొదట్లో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత విజయాల శాతం తగ్గింది. అందుకే కొత్త ఏడాదిలో సరికొత్తగా మనముందుకు రానున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article