శ్రీ కాశినాయన
కాశినాయన మండలంలోని కొండరాజు పల్లె గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే రైతుకు చెందిన వరిగడ్డి వామికి బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు రేగి వరిగడ్డి కాలిపోతుండటంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.కాగా అప్పటికే వరిగడ్డి అగ్నికి ఆహుతైంది సుమారు రూ. 50వేల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు.