విజయవాడ:వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏపీలో కాంగ్రెస్‌లో చేరికలు మొదలయ్యాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఆదివారం షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు శెట్టి గంగాధర్, మరికొందరు వైసీపీ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో టీడీపీ, వైసీపీలలో టికెట్ దొరకని నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం వుంది.