Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుకాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయం

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయం

అధికార ప్రతిపక్ష పార్టీలు దొందు దొందే కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సుధాకర్ బాబు

కడప సిటీ

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని కడప పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధాకర్ బాబు వెల్లడించారు. అధికార ,ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, వారి తప్పులను కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ తులసి రెడ్డి జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాముల తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులను బూత్ లెవెల్ కార్యకర్తలను సమన్వయపరుస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం ఏమి లేదన్నారు. కర్ణాటక తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఇంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పాలన నుండి రాష్ట్రాన్ని మనము రక్షించాలని పిలుపునిచ్చారు. అరకు లోయ ఒకప్పుడు కాఫీకి ప్రసిద్ధి అని, ప్రస్తుతం గంజాయి సాగుతో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. అప్పుల ఆంధ్ర ప్రదేశ్, అవినీతి ఆంధ్ర ప్రదేశ్ గా మారిందన్నారు. బిజెపి బానిస పార్టీలు (వైకాపా టీడీపీ జనసేన) రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ 2024 లో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆరు సూత్రాల కార్యక్రమం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశం అనంతరం నియోజకవర్గ కోఆర్డినేటర్లతో మండల పట్టణ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ డి విజయ జ్యోతి, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం శర్మ, రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్ ,పూల నజీర్, శామలమ్మ, మధు రెడ్డి ,పాలగిరి శివ, కదిరి ప్రసాద్ గౌడ్, అరిఫుల్ల నరసింహారెడ్డి, ఉత్తన్న కృష్ణారెడ్డి , కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి ,పుష్పరాజు, నాగూర్ యేసయ్య, రాజేష్ జిలాని భాష, రామాంజనేయులు, పీర్ల రషీద్, శ్రీకాంత్, శివ ,చిన్నపరెడ్డి, అచ్యుత రాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article