తిరిగి దొరికిన వజ్రం వైయస్ షర్మిలమ్మ
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత రెడ్డి
కడప సిటీ:కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత రెడ్డి ని, ప్రజా భూమి పత్రిక విలేఖరి రవి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, కడప జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి డైమండ్ లాంటి వ్యక్తి అని సంబోధించారు. బలహీన పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని గతంలో ఆయన పాదయాత్ర బలోపేతం అయ్యే దానికి దోహదపడ్డారు . ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి. పాలించిన పరిపాలన విధానాన్ని మేము గుర్తు వేసుకుంటూ, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు వజ్రం కడుపున వజ్రం లాంటి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ పుట్టింది ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా రావటం మా అందరికీ గర్వకారణం అన్నారు. షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి పూర్వ వైభవం షర్మిలమ్మ గారి పాదయాత్ర తోటి కూడా వస్తది అన్న నమ్మకం తోటి రేపు జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తారని ఆమె అన్నారు. ఇప్పటికే షర్మిలమ్మ రాష్ట్రం మొత్తం నలుమూలల ఉన్నటువంటి జిల్లాలలో పర్యటిస్తూ, పార్టీ కింద స్థాయి కేడర్ నుంచి,ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులు అందర్నీ బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు అన్నారు. ఆమె యొక్క పర్యటన తోటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నూతన ఉత్తేజము ఉత్సాహము ఉరవలు తొక్కుతు సునామీ మాదిరిగా ఉప్పొంగుతుంది అన్నారు.