మోడరన్ ప్రైమరీ స్కూల్ అకాడమీ డైరెక్టర్ రమాదేవి మోడరన్ ప్రైమరీస్కూల్ లో ఘనంగా వార్షికోత్సవం
రామచంద్రపురం
విద్యార్థుల్లో మానసిక ఉల్లాసానికి, సృజనాత్మక కళల పట్ల మక్కువ పెంచడానికి క్రమం తప్పకుండ ప్రతీ విద్యాసంవత్సరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మోడరన్ ప్రైమరీ స్కూల్ అకడమిక్ డైరెక్టర్ ఎ.రమాదేవి అన్నారు.శుక్రవారం స్థానిక ముచ్చిమిల్లిలో ఉన్న మోడరన్ ప్రైమరీ స్కూల్ లో కోలాహాలంగా జరిగిన వార్షికోత్సవంలో చిన్నారులకు జరిగిన పట్టా ప్రధానోత్సవం చూపరులను ఆకట్టుకుంది.ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనుల పండుగగా సాగాయి.అనంతరం మోడరన్ విద్యాసంస్థల హైస్కూల్, ఇంటర్ విద్య అభ్యసించి ఇటీవలే ఎస్.ఐ.పోస్టుకు ఎంపికైన కారుమూరి సూర్యవంశీ,మేడిశెట్టి లక్ష్మి సత్యవతిలను మోడరన్ విద్యాసంస్థల అధినేత ఇన్స్పైరింగ్ ఐకాన్ పురస్కారంతో సత్కరించారు.అలాగే పది సంవత్సరాలుగా మోడరన్ లో విద్య అభ్యసిస్తున్న 12 మంది పేరెంట్స్ ని డివోటెడ్ పేరెంట్స్ అవార్డుతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మోడరన్ అధినేత లయిన్ జి.వి.రావు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ప్రజ్ఞాపాటవాలు చాటుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మోడరన్ స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.