27 లక్షలతో కల్వర్టు నిర్మాణం.
లేపాక్షి: మండల పరిధిలోని కొండూరు పంచాయతీలోని పొలాలకు వెళ్లే రహదారిలో కల్వర్టుల నిర్మాణానికి జడ్పిటిసి శ్రీనివాసరెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. 27 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో కల్వర్టుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు జెడ్పిటిసి తెలిపారు. చాలా ఏళ్లుగా పొలాలకు వెళ్లే రహదారిలో కల్వర్టు లేకపోవడంతో రైతులు వర్షాకాలంలో పలు ఇబ్బందులకు గురయ్యే వారున్నారు. ఈ సమస్య తన దృష్టికి రావడంతో వెంటనే 27 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధులను మంజూరు చేయించి కల్వర్టులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దీంతో ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ నారాయణస్వామి, లేపాక్షి సర్పంచ్ ఆదినారాయణ, కోడి పల్లి సర్పంచ్ మంజునాథ్, వైకాపా నాయకులు లేపాక్షి నారాయణస్వామి,శివప్ప చలపతి ,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.