*హింసకు హింసే సమాధానమా..?
*గృహ హింస నేరమే…అందుకు పోలీస్ హింస లేదు గా…
*స్త్రీని హింసించడం తప్పే….
*నాలుగో సింహం న్యాయం తప్పద్దు గా…
*పరివర్తన ఎవరి లో రావాలి..
*హింసకు అహింసాయుతంగా అణచి వేయలేరా…
*న్యాయస్థానం ఉన్నది ఇంకెందుకు…
*శునకానికి ఉన్న విశ్వాసం మనిషికి లేకపోయేనే…
*అన్నము పెట్టినందుకు ఆ శునకం అతిప్రేమ చూపిస్తే..
*అండగా ఉండాల్సిన పోలీస్ అతి కిరాతకంగా ప్రవర్తిస్తే…
*రాజశేఖరా ఏమిటీ రాక్షసతత్వం…

- ప్రేండ్లీ పోలీస్ అంటే ఇదేనా…
*కొత్త పేట పోలీస్ స్టేషన్లో కుక్క లు కూడా శిక్షిస్తాయా…
*ఖాకీ..కుక్క దెబ్బకు కండరాలు కమిలిన వైనం…
*ఖాఖీ కి కరుణలేకపోయే..కుక్క కరవకుండా ఉండకపోయే…
*ఏమిటా ఖాకీ…కుక్క కథ…
(రామమోహన్ రెడ్డి)
“నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని
మారదు లోకం మారదు కాలం”అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గాయం సినిమా ద్వారా ఈ సమాజ పోకడలపై చక్కటి గేయాన్ని రచించి.వినిపించారు. ఆనాడు ఆలా ఎందుకు అలా అన్నారో ఈనాటి పరిస్థితి చూస్తూంటే ఆహా అది నిజమే కాబోలు అనిపిస్తుంది. ఖాకీ అంటే పోలీసు …పోలీసులు అంటే రక్షక భటులు. వారి ప్రధమ కర్తవ్యం ప్రజా రక్షణ. వారిని వెంటనే , పదిమందిలోనూ గుర్తించడానికి ఒక యూనిఫార్మ్ అవసరం. అది మన దేశంలో ఖాకీ.అందుకే ఖాకీ లని ప్రత్యేక మర్యాద ,గౌరవం తో చూస్తాం. కానీ ఖాకీ వెనుక ఉన్న కరుణ కంటే కాఠిన్యం చాలా ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టబడుతోంది.తప్పు చేస్తే శిక్ష వేయాల్సిందే కానీ చేసిన తప్పు ఏమిటీ ఎలాంటిదన్న కోణం కూడా ఒకటి ఉంటుంది. కానీ విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఖాకీ ఓ కుక్క కథ వింటే కడుపు టారుక్కుపోవడమే కాకుండా ఖాకీల కాఠిన్యం ఇంత భయానకంగా ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే …విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న నాగరాజు అనే కుటుంబం లో భార్య భర్తలకు వివాదం తలెత్తడం తో నాగరాజు భార్య సంబంధిత పోలీసు అధికారులను అశ్రయిస్తే వారు 498A గృహహీంస కింద కేసు నమోదు చేసినట్లు బాధితుడు నాగరాజు తెలిపారు.ఈకేసు నిమిత్తం నాగరాజును స్టేషన్ కి పిలిపించి మందలించిన సదరు ఎస్ ఐ రాజా నరేంద్ర నాగరాజును ఓ మూలన కూర్చోబెట్టగా కొంత సమయానికి సాధారణంగా రాత్రి పూట గస్తీ కోసం తిరిగే ఒక సీఐ ఆ స్టేషన్ కు రావడం జరిగింది. స్టేషన్ కు వచ్చిన సీఐ అక్కడ ఉన్న నాగరాజును చూడగానే ఏమి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు నాగరాజును తీవ్రంగా కొట్టడం జరిగిందని బాధితుడు తెలిపాడు. అయితే పోలీసు స్టేషన్ ఆవరణలో చాలా కాలంగా ఒక కుక్క అక్కడే ఉంటుంది.సాధారణంగా సిబ్బంది కొంత ఆహరం ఇస్తూ ఉండటం తో ఆ కుక్క అక్కడే ఉంటుందనేది జగమెరిగిన సత్యం అది పోలీస్ జాగీలము కాదు. ఈ కుక్క కు ఉన్న విశ్వాసం ఎలాంటిది అంటే పోలీసులు ఎవరికయిన కొంత దేహశుద్ధి చేస్తుంటే అక్కడ పోలీసు వారిని ఎవరయిన ఏదయినా చేస్తున్నారని దాడి చేయడం ఆలవాటు ఉన్నట్టు సమాచారం.అది యజమాని మీద ఉన్న ఆ కుక్క భక్తి .అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే గృహహింస కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. భార్య భర్తల మధ్య వివాదం తలెత్తిన ప్పుడు సాధారణంగా మా మండలింపు లో భాగంగా పోలీసు వారు కొంత కటువుగా మాట్లాడుతూ ఉంటారు అది సహజం. ఎందుకంటే సమాజ తీరును బట్టి వారి వారి స్థితిని బట్టి మందలింపు అనేది కొంత గట్టిగానే ఉంటుంది పరుష పదజాలం వస్తుంది కూడా.అలా లేకపోతే కొన్ని సార్లు నియంత్రణ కష్టమవుతుంది.
కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కేసు కట్టిన ఎస్ ఐ ,ఆ స్టేషన్ సీఐ కి లేని కోపం ఆవేశం రాత్రి పూట గస్తీలో భాగంగా అటువైపు వచ్చిన ఓ సీఐ కి ఎందుకు కోపం వచ్చిందో తెలియడం లేదు.కోపం వస్తే మండలించవచ్చు ఇలా ఒంటిమీద గాయాలు అయ్యేలా పైగా అక్కడ ఉన్న కుక్క కూడా మీద పడి కాటువేస్తుంటే చూసి కూడా మౌనంగా ఉండటమే పెద్ద హింస గా భావించాల్సి వస్తొంది. గృహ హింస అన్నది తప్పే అందుకు న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరాసవహించాల్సి వస్తుంది. పోలీసు అధికారులు కూడా మందలింపు లో భాగంగా ఓ దెబ్బ కొట్టొచ్చు ..దెబ్బ అనేది నేరం అయిన ఆ మాత్రం మందలింపు లేకుంటే మానవ సమాజం దారికి రాదు.అయితే అతి కిరాతకంగా గృహహీంస కు ఇలా హింసించడం అనేది సమాజ హితం కాదన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఒక స్త్రీ ని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ హింసించడం నేరమే అయితే ఇక్కడ గృహ హింస అన్నది కూడా చట్టం దృష్ఠిలో నేరం అయిన తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయడమే సరైనది కాదని నాలుగు సింహం కు తెలిసిన ఇలా గ్రామ సింహం తో కాటు వేసేలా చేయడమన్నది సరైన పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇలాంటి కొంత మంది పోలీసు అధికారుల తీరుతోనే ప్రభుత్వాలు కూడా ఫ్రెండ్లీ పోలీస్ అని అంటున్నా ఇలా ఒళ్ళు పగలగొట్టే పోలీసు ను చూస్తుంటే పోలీస్ కే పోయేల ఉందని విమర్శలు వచ్చిపడుతున్నాయి.
దీనిపై ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూడాలని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.