

గాజువాక:40వ వార్డులో కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాలు మేరకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పీలా రమాకుమారి ముఖ్యఅతిథిగా నూకాంబిక వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ భవనం 38, 60 లక్షలతోను, మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం 16, 50 లక్షలతోను, ఈ రెండు కమ్యూనిటీ భవనాలను ప్రారంభోత్సవం చేశారు . అనంతరం 1 సెంటు జగనన్న ఇల్లు లబ్ధిదారులకు 212 రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ చేశారు మరియు ప్రియతమ నేతఆడారి ఆనంద్ కుమార్ పింఛను రానివారికి తన సొంత నిధులతో పశ్చిమ నియోజకవర్గంలో అనేకమందికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా 40 , 63 వార్డులకు గాను రమాకుమారి చేతుల మీదే ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆర్పీలు, రాంజీ భీమ్ రావ్ ఎస్సీ సేవా సంఘం సభ్యులు, నూకాంబిక రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, యువత, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
