- రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా.పోతుల నాగరాజు
అనంతపురము :రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ రంగాన్ని (కమ్యూనిటి నేచురల్ ఫార్మింగ్) అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న సిబ్బందికి గత 17 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. ఈ బకాయిలను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మానవత్వంతో ఆలోచన చేసి, వారికి వేతనాలు చెల్లించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యనిర్వాహక అధికారికి సిబ్బంది పక్షాన
రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా.పోతుల నాగరాజు విన్నవించారు. గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అనేక విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా అవకాశం కల్పించాలని, వారికి కూడా ప్రతీ నెల మొదటి వారంలో వేతనాలు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వ్యవసాయ శాఖ పరిధిలో ప్రకృతి వ్యవసాయ కోసం పనిచేసే వారు దాదాపు1500 మంది ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ శాఖలో పని చేస్తూ నిరంతరం వారి శ్రమను ధారపోస్తున్నారు. అలాంటి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నానన్నారు.

